ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 101 కేసులు నమోదు - ఏపీ కోవిడ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం కొత్తగా 101 కేసులు నమోదుకావడం ఆందోళనకు గురి చేస్తోంది. ఒక్క గుంటూరులోనే 63 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,386కు చేరింది.

గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 101 కేసులు
గుంటూరు జిల్లాలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 101 కేసులు

By

Published : Jun 28, 2020, 10:16 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,386కు పెరిగింది. తాజాగా గుంటూరులో 63 పాజిటివ్ కేసులు గుర్తించారు. నగరంలోని నల్లచెరువు ప్రాంతంలో 37 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

నల్లపాడులో 6, ఆర్.అగ్రహారంలో 4, బ్రాడీపేటలో 3, సంపత్ నగర్​లో 3, శ్రీనివాసరావుతోటలో 2 కేసులు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నరసరావుపేటలో మరో 14 కేసులు, తెనాలిలో 4, మాచర్లలో 5, మంగళగిరిలో 3, దాచేపల్లిలో 2 కేసులు చొప్పున బయటపడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details