ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : ఆస్పత్రులకు మందుల పంపిణీకి కమిటీ ఏర్పాటు - telangana varthalu

తెలంగాణలో కొవిడ్ వైరస్‌ చికిత్సలో ఉపయోగించే టొసిలిజుమాబ్ ఇంజక్షన్లను బాధితులకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయటంతోపాటు... అత్యవసరమైన బాధితులు ఆస్పత్రులు, ఔషధాల దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంజక్షన్లు దొరకే అవకాశం ఏర్పడనుంది.

తెలంగాణ : ఆస్పత్రులకు మందుల పంపిణీకి కమిటీ ఏర్పాటు
తెలంగాణ : ఆస్పత్రులకు మందుల పంపిణీకి కమిటీ ఏర్పాటు

By

Published : Apr 30, 2021, 5:40 PM IST

తెలంగాణలో వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తుండగా ప్రాణాధార మందుల కోసం ఔషధ దుకాణాల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొవిడ్ వైరస్‌ చికిత్సలో ఉపయోగించే టొసిలిజుమాబ్ ఇంజక్షన్లను బాధితులకు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. డీఎంఈ రమేశ్‌రెడ్డి, డీహెచ్​ శ్రీనివాసరావు, నిమ్స్​ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌తో కూడిన ఈ బృందం అర్హులైన వారికి టొసిలిజుమాబ్‌ను అందించనుంది.

ఇందుకోసం ఆయా ఆస్పత్రుల వారు డీఎంఈ కార్యాలయాన్ని సంప్రదించాలని కమిటీ సూచించింది. ఒక్కో రోగికి సంబంధించి ఆస్పత్రులు పంపిన వివరాలను పరిశీలించిన అనంతరం కమిటీ సభ్యులు... బాధితులకు టొసిలిజుమాబ్ ఇంజక్షన్లను కేటాయించనున్నారు. ఫలితంగా బ్లాక్ మార్కెట్‌ను కట్టడి చేయటంతోపాటు... అత్యవసరమైన బాధితులు ఆస్పత్రులు, ఔషధాల దుకాణాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంజక్షన్లు దొరకే అవకాశం ఏర్పడనుంది.

ఇదీ చదవండి:కొవిడ్​-19 రోగులను చేర్చుకోవడం ఆపేశాం..!

ABOUT THE AUTHOR

...view details