ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వినాయక విగ్రహాల తరలింపుపై కమిషనర్ అనురాధ ఆగ్రహం - గుంటూరు కమిషనర్ చల్లా అనురాధ ఫైర్

వినాయక విగ్రహాల తరలింపుపై కమిషనర్ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-September-2021/12992300_anu.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/07-September-2021/12992300_anu.jpg

By

Published : Sep 7, 2021, 12:04 PM IST

గుంటూరులో సోమవారం చెత్త తరలించే వాహనాల్లో వినాయక ప్రతిమలను తరలించిన ఘటనపై కమిషనర్ అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై స్పందించిన ఆమె.. శానిటరీ సూపర్‌వైజర్​ను విధుల నుంచి తొలగించారు. ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారులకు చెప్పకుండా విగ్రహాలు తొలగించడంపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details