సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ... పెళ్లి వేడుకలో ప్లకార్డులు..!
ఓ పెళ్లి వేడుకలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) వద్దు, జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ) వద్దు అంటూ... ప్లకార్డులు పట్టారు నవదంపతులు. గుంటూరు శివనాగరాజు కాలనీలో... కిరణ్ కబీర్ వివాహం జనవరి 30న జరిగింది. ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శిగా ఉన్న కబీర్... తన వివాహ వేడుకలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వ్యతిరేకిస్తూ... ప్లకార్డులను ప్రదర్శించారు. అతని స్నేహితుల బృందంతో కలిసి సీఏఏ, ఎన్‌ఆర్‌సీ వద్దూ అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
caa, nrc anti slogans in marriage function