బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ అభిప్రాయపడ్డారు. గుంటూరులోని పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్‌ను అమ్మకానికి పెట్టడంపై ఆయన ఇవాళ నగరపాలక సంస్థ కమిషనర్ అనురాధను కలిశారు. మార్కెట్‌ను అమ్మివేస్తే దానిపై ఆధారపడిన వారి జీవితాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ స్థలాన్ని అమ్మకం నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు. సుప్రీకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదని గుర్తు చేశారు.
‘మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదు’
బిల్డ్ ఏపీ పేరుతో ప్రభుత్వ భూములు అమ్మడం సరికాదని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ భూములు అమ్మడానికి వీల్లేదని గుర్తుచేశారు.
మస్తాన్ వలీ అభ్యర్థన