- కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల ప్రాసెస్‌కు ఆదేశాలు.. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ
కొత్త పే స్కేళ్ల ప్రకారం తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ట్రెజరీ ఉద్యోగులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
- పీఆర్సీ హెచ్ఆర్ఏలో మార్పులు.. అక్కడ పనిచేసే వారికి 16 శాతం హెచ్ఆర్ఏ
కొత్త వేతన స్కేళ్ల ప్రకారం ఇచ్చిన హెచ్ఆర్ఏలో మార్పులు చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సమీప ప్రాంతాల్లోని హెచ్‌వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఆదేశాలిచ్చింది.
- New Districts In AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి.. కొనసాగుతున్న ఆందోళనలు
కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలుగా తమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల జిల్లా పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
- పీఆర్సీ వ్యాజ్యం మరోసారి సీజే నిర్ణయానికి
వేతన సవరణ (పీఆర్సీ) జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై ఏ ధర్మాసనం విచారణ జరపాలనే విషయంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర మరోసారి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- ఘనంగా బీటింగ్ రీట్రీట్ వేడుక.. అబ్బురపరిచిన డ్రోన్ల ప్రదర్శన
గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించిన బీటింగ్ రీట్రీట్ ఘనంగా జరిగింది. దేశ రాజధాని దిల్లీలోని విజయ్‌చౌక్‌లో కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
- 'భారత్‌లో కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు.. అప్రమత్తత అవసరం'
భారత్‌లో కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవటంపై దృష్టి సారించాలని సూచించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.
- ఆ దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్!
సింగపూర్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఇప్పటికే భారత్ సహా 50కు పైగా దేశాల్లో బయటపడ్డ బీఏ2 ఒమిక్రాన్ వేరియంట్ సింగపూర్‌లో కూడా గుర్తించారు శాస్త్రవేత్తలు.
- Budget 2022: కొవిడ్ అస్థిరతకు బడ్జెట్ మాత్ర
కొవిడ్ కష్టకాలంలో ఔషధాలు, వ్యాక్సిన్ల రూపంలో యావత్తు దేశానికి ఫార్మా, వైద్యపరికరాల పరిశ్రమలు అండగా నిలిచాయి. ఎగుమతులతో ప్రపంచ దేశాలనూ ఆదుకున్నాయి. వైద్యారోగ్య రంగంతో భుజం కలిపి దేశ ప్రజల సంరక్షణలో కీలక పాత్ర పోషించాయి.
- ఆసియా గేమ్స్‌లో భారత చెస్ టీమ్ మెంటార్‌గా ఆనంద్
ఈ ఏడాది ఆసియా గేమ్స్ దృష్ట్యా భారత చెస్ అటగాళ్లను పోటీకి సిద్ధం చేస్తోంది ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్. ఈ మేరకు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది.
- 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్స్.. దిల్‌రాజు బిగ్ న్యూస్!
'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్' వంటి బడా సినిమాల రిలీజ్ డేట్లపై ఆసక్తికర ప్రకటన చేశారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఫిబ్రవరి చివరి వారం నుంచి వారానికో పెద్ద సినిమా విడుదలవుతుందని అన్నారు.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @9PM