ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2020, 2:29 PM IST

ETV Bharat / city

హైదరాబాద్​ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగికి కరోనా!

గుంటూరు జిల్లా మంగళగిరి పరిధిలో ముగ్గురికి కరోనా సోకింది. ఈ కేసుల్లో హైదరాబాద్​ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగి ఉన్నారు. ఈయన మంగళగిరి మండలం నవులూరులో ఐదుగురితో కలిసి ఉంటున్నారు. అతన్ని ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు.. మిగిలిన వారిని క్వారంటైన్​కు పంపారు. మరోవైపు.. సీఎం నివాసం సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్​కి కరోనా సోకింది.

హైదరాబాద్​ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్
హైదరాబాద్​ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగికి కరోనా పాజిటివ్

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. సచివాలయం వ్యవసాయ శాఖలో పని చేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి రెండు రోజుల క్రితం 10 బస్సుల్లో సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివచ్చారు. వీరిలో దాదాపు 230 మందికి మంగళగిరిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు.

ఈయన మంగళగిరి మండలం నవులూరులోని ఓ అపార్ట్​మెంట్​లో మరో ఐదుగురు ఉద్యోగులతో కలిసి ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఉద్యోగిని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారిని క్వారంటైన్​కి పంపించారు.

మరోవైపు.. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసం సమీపంలో విధులు నిర్వహిస్తున్న కర్నూలు రెండో బెటాలియన్​కు చెందిన కానిస్టేబుల్​కి కరోనా సోకిన కారణంగా అధికారులు ఆయన్ను కొవిడ్ ఆస్పత్రికి తరలించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో దిల్లీ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకంది. అతణ్ని అధికారులు ఆస్పత్రికి పంపించారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details