ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి రక్షక దళం... పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండాల్సిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని....పోలీసులు అప్రమత్తతో ఉంటారని తెలిపారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తారన్నారు. ఇది స్వచ్ఛందంగా ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనని చెప్పారు. డయల్ 100 ద్వారా విస్తృతంగా, నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
మన కోసం మనం చేసే చిరు ప్రయత్నం... జనతా కర్ఫ్యూ
'ఆదివారం ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇంటి వద్దనే ఉండండి.... మీకు అండగా బయట రక్షక దళం ఉంటుంది' అంటున్నారు ఏపీ పోలీసులు. ఆదివారం జనతా కర్ఫ్యూను అందరూ పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ap police