ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త ఏడాదిలోనైనా సీఎం జగన్​ మనసు మారాలి: రాజధాని రైతులు - Amaravati Farmers Protesting Over Capital city

ప్లవ నామ సంవత్సరంలోనైనా సీఎం జగన్​ మనసు మారాలని దీకా శిబిరాల్లో అమరావతి రైతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉగాది రోజూ కూడా రైతులు ఆందోళనలు కొనసాగించారు.

Farmers Protesting on ugadi
అమరావతి రైతుల అందోళనలు

By

Published : Apr 13, 2021, 8:16 PM IST

ప్లవ నామ సంవత్సరంలోనైనా ముఖ్యమంత్రి జగన్ మనస్సు మారాలని.. రాజధాని రైతులు దీక్షా శిబిరాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పురస్కరించుకొని దీక్షా శిబిరాలలో పంచాంగ శ్రవణం చేశారు. నూతన సంవత్సరంలో రైతుల కోరికలు ఫలిస్తాయని పంచాంగకర్త తెలిపారు. తుళ్లూరులో రైతులు, మహిళలు హనుమాన్ పారాయాణం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ వైఖరి వల్ల రోడ్డుపైనే పండుగ చేసుకుంటున్నామని రైతులు వాపోయారు. వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెంలో రైతులు నిరసన దీక్షలు కొనసాగించారు.

ABOUT THE AUTHOR

...view details