ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఆటోల్లో 'అభయం' యాప్: హోంమంత్రి

By

Published : Jun 15, 2021, 4:12 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఆటోల్లో అభయం యాప్​ను ఏర్పాటు చేయనున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మహిళా ప్రయాణికుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రస్తుతం విశాఖలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో అన్ని జిల్లాల్లో విస్తరింపజేస్తామని చెప్పారు.

హోంమంత్రి మేకతోటి సుచరిత
హోంమంత్రి మేకతోటి సుచరిత

మహిళా ప్రయాణికుల రక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఆటోల్లో అభయం యాప్​ను ఏర్పాటు చేయనున్నామని హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ప్రయోగాత్మకంగా విశాఖలో ఈ విధానం విజయవంతంగా అమలవుతుందన్న హోంమంత్రి.. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేయనున్నామని చెప్పారు. ఆటోల్లో ఎక్కాక రక్షణ లేకుంటే... ఆటోల్లో అమర్చే మీటనొక్కితే ఆగిపోతుందని చెప్పారు. అభయం యాప్ ద్వారా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. గుంటూరు జిల్లాలో వాహనమిత్ర పథకం కింద లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిచారు. అనంతరం వాహనర్యాలీని ప్రారంభించారు. కరోనాతో జీవనోపాధి కోల్పోయిన ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం వాహనమిత్ర ద్వారా ఆదుకోవడంపై డ్రైవర్లు ఆనందంగా ఉన్నారని సుచరిత వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details