ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @ 3pm - ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 3pm
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Dec 30, 2021, 3:01 PM IST

  • మార్గదర్శకాలు విడుదల

Vaccination Guidelines: 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్​పై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనవరి 3 నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం కొవాగ్జిన్‌ టీకానే వేస్తున్నట్టు ప్రకటించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'నోరు అదుపులో పెట్టుకోండి'

Vellampalli on Vangaveeti protection: ప్రతిపక్ష నేతలు హద్దు మీరి మాట్లాడుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే అంతకంటే ఘాటుగా స్పందిస్తామని హెచ్చరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'పేరు మార్చకపోతే కూల్చేస్తాం'

Jinnah Tower issue: గుంటూరులోని జిన్నాటవర్‌ పేరు మార్చాలని భాజపా నేతలు డిమాండ్​ చేస్తున్నారు. లేదంటే ఆ టవర్​ కూలుస్తామని హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వేడుకలపై ఆంక్షలు

NEW YEAR CELEBRATIONS: కరోనా నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు విధించారు. రేపు రాత్రి బహిరంగ వేడుకలకు అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • యథాతథం

UP polls 2022: ఉత్తర్​ప్రదేశ్​లో మూడురోజులు పర్యటించిన కేంద్ర ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర.. కీలక వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ప్రణాళిక ప్రకారమే.. ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు తమను కోరాయని చెప్పారు. ఈ మేరకు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • మరో రైల్వే స్టేషన్​ పేరు మార్పు

Jhansi railway station new name: ఇప్పటికే రెండు రైల్వే స్టేషన్ల పేర్లు మార్చిన ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం.. తాజాగా మరో స్టేషన్​ మారును మార్చుతున్నట్లు స్పష్టం చేసింది. ఝాన్సీ రైల్వే స్టేషన్​ను... వీరాంగణ లక్ష్మీబాయి రైల్వే స్టేషన్​గా మార్చుతున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భారీ భూకంపం

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై 7.3 తీవ్రత నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • గడువు పొడిగింపు

EPF nomination deadline: ఈపీఎఫ్​ ఈ-నామినేష‌న్ జ‌త చేయనివారికి శుభవార్త. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ జ‌త చేయ‌వ‌చ్చు. దీనికి ఇప్పటివరకు ఎలాంటి గడువు తేదీని నిర్ణయించలేదని పేర్కొంది ఈపీఎఫ్​ఓ. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'బలమే.. బలహీనతగా మారొచ్చు'

Team India Batting Coach: కొన్నిసార్లు విరాట్​ కోహ్లీ బలమే.. అతడి బలహీనతగా మారే అవకాశముందని అన్నాడు భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్. ఇక ఫామ్​లేమితో సతమతమవుతున్న సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె.. తిరిగి పుంజుకునేందుకు శక్తిమేర ప్రయత్నిస్తున్నారని చెప్పాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • బర్త్​డేకు రూ.కోట్లలో కానుకలు

Salman Khan: ఇటీవలే తన 56వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేసుకున్నారు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. ఈ పార్టీకి బీటౌన్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు భాయ్​కు రూ.కోట్లు విలువజేసే కారు, బ్రాస్​లెట్​లు కానుకగా ఇచ్చారు. మరి కత్రినా కైఫ్​ ఏమిచ్చిందంటే? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details