- Farmers Meeting In Tirupati: 'ఉద్దేశపూర్వకంగానే తిరుపతి సభకు అనుమతి నిరాకరణ'
Farmers Meeting In Tirupati: తిరుపతిలో సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై హైకోర్టును ఆశ్రయిస్తామని అమరావతి రైతులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. సభ కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- హెలికాప్టర్ ప్రమాద ఘటనలో మరో ఆరు మృతదేహాలు గుర్తింపు
Coonoor helicopter accident: తమిళనాడు కూనూర్ హెలికాప్టర్ ప్రమాదంపై సైన్యం ఓ ప్రకటన చేసింది. తాజాగా.. ఆరు మృతదేహాలను గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. మరో నలుగురి మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పేర్కొంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- VISAKHA SRI SARADA PEETHAM: మృతి చెందిన వేద విద్యార్థుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున సాయం
five students died in krishna river: గుంటూరు జిల్లా మాడిపాడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందిస్తామని విశాఖ శ్రీ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మిగిలిన విద్యార్థులను తమ వేద పాఠశాలలో చదివిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పాలమూరు-రంగారెడ్డి జాతీయ హోదా కోసం మళ్లీ యత్నం.. కేంద్రానికి లేఖ రాయనున్న కేసీఆర్!
Palamuru Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం అభ్యర్థిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... మరోసారి ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీనిపై త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నారని తెలుస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- India Covid Cases: 559 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
India Covid Cases: దేశంలో కొవిడ్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 7,992 కేసులు వెలుగులోకి వచ్చాయి. 393 మరణాలు సంభవించాయి. శుక్రవారం 76,36,569 మందికి టీకాలు అందించారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- పూరీ క్షేత్రంలో మరో ఘోరం- బాలుడిపైనే ఆలయ పూజారి..
Servitor harassing boy: పూరీ క్షేత్రంలో పనిచేసే పూజారి.. ఓ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రెండు నెలల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి.. ఐపీసీ, పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు పోలీసులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అత్యంత కచ్చితత్వంతో కొవిడ్‌ను పసిగట్టే 'పాస్‌పోర్ట్'
మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్ రాపిడ్ టెస్ట్‌ని సింగపూర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని అంటున్నారు. దీనికి 'ప్యార్లల్ యాంప్లిఫైడ్ సెలైవా, ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్' (పాస్‌పోర్ట్) అని పేరు పెట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఔషధ అమ్మకాలు మళ్లీ పైపైకి.. కారణం అదే!
ఈ ఏడాది నవంబరు నెలలో మందుల అమ్మకాలు, క్రితం ఏడాది ఇదేకాలంతో పోల్చితే 6.6 శాతం పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యసేవలు సాధారణ స్థితికి చేరుకోవటం, జీవనశైలి వ్యాధులు, ఇతర జబ్బుల బారిన పడినవారు చికిత్సలకు వెళ్లి మందులు కొనుగోలు చేస్తున్నందున నవంబరు నెల మందుల అమ్మకాల్లో కొంత పెరుగుదల ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఇది కార్ల్‌సన్ అడ్డా.. ఇతడికి ఎదురే లేదురా బిడ్డా!
Magnus Carlsen Championship 2021: ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. మరోసారి టైటిల్ ఎగరేసుకుపోయాడు 31 ఏళ్ల నార్వే యోధుడు మాగ్నస్ కార్ల్‌సన్. ఇప్పటికే 2013, 2014 సంవత్సరాల్లో విశ్వనాథన్ ఆనంద్‌ను, 2016లో కర్జాకిన్‌ను, 2018లో కరువానాను ఓడించి టైటిల్ అందుకున్న మాగ్నస్.. తాజా ఛాంపియన్‌షిప్‌లో రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై 7.5-3.5 పాయింట్లతో విజయం సాధించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- RRR Press meet: 'ఆర్‌ఆర్‌ఆర్ ప్రతి ప్రేక్షకుడ్ని అలరిస్తుంది'
RRR Press Meet: 'ఆర్‌ఆర్‌ఆర్' స్పెషల్ చిట్‌చాట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు తారక్, చరణ్, రాజమౌళి ఆసక్తికర సమాధానాలు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.