విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలంటు.. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆందోళన చేపట్టింది. వివిధ కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నాయి. ఏలూరు పాత బస్టాండు కూడలిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఆపాలంటూ నినాదాలు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన విశాఖ ఉక్కును విదేశీ సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ఆందోళనకారులు ప్రశ్నించారు. వేలాది మంది కార్మికుల పొట్టకొట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏలూరులో ఆందోళన - ఏలూరు విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆందోళన చేపట్టింది. పరిశ్రమను ప్రైవేటుపరం చేసే ఆలోచనను విరమించుకోవాలని ఆందోళన కారులు నినాదాలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ ఏలూరులో ఆందోళన