ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 3, 2020, 3:06 PM IST

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

top ten news in andhrapradesh
top ten news in andhrapradesh

  • రైలు కింద పడి కుటుంబం ఆత్మహత్య
    కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం చోటు చేసుకుంది. గూడ్స్ రైలు కింద‌పడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు. నంద్యాల నుంచి అటోలో వచ్చినవారు అత్మహత్యకు పాల్పడ్డారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • విశాఖ యువతి హత్య కేసులో మరో మలుపు
    విశాఖ యువతి హత్య కేసులో రౌడీషీటర్‌ కుమారుడి ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ యువతికి పరిచయస్తుడైన రామ్‌ను కొట్టించడానికి ఇద్దరు వ్యక్తులు ఓ రౌడీషీటర్‌ కుమారుడిని ఆశ్రయించినట్లు విచారణలో తెలింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • దేవినేని పర్యటనను అడ్డుకున్న వైకాపా నేతలు
    టిడ్కో ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో వైకాపా నాయకులు వాగ్వాదానికి దిగారు. తమ గ్రామంలోకి రావటానికి వీలు లేదంటూ అడ్డగించటంతో.. దేవినేని రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • రివర్స్ పాలన జరుగుతోంది..
    కేంద్రం నిధులు ఇస్తుంటే కనీసం వినియోగించుకోలేని స్థితిలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఉందని భాజపానేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ఇళ్ల విషయంలో జరిగిన ఆక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • అదే నా విజయ రహస్యం
    భారత్​లోని తల్లులు, కూతుళ్లపై శ్రద్ధ కనబర్చటమే తన విజయానికి కారణమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • వాయు నాణ్యత బేజారు
    దిల్లీలో ఉష్ణోగ్రత ఈ సీజన్​లోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. మంగళవారం 10 డిగ్రీల సెల్సియస్​కు తగ్గింది. హిమాచల్​లోని శీతల ప్రాంతాలతో పోలిస్తే రాజధానిలోనే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు దిల్లీలో వాయు నాణ్యత సూచీ మరోసారి తీవ్ర స్థాయికి పడిపోయింది. ఈ నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉంది..పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • ఫలితంపై ఉత్కంఠ
    ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంపే వస్తారా? లేదా బైడెన్​కు అధికారం దక్కుతుందా? ఎప్పటిలాగే మంగళవారం రాత్రే ఫలితాలు వస్తాయా? మెయిల్ ఓటింగ్ కారణంగా ఆలస్యం జరగుతుందా? అనే ప్రశ్నలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్​ఫోన్లు- ధర ఎంతంటే?
    చాలా కాలం తర్వాత దేశీయ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది మైక్రోమ్యాక్స్. బడ్జెట్ సెగ్మెంట్​లో ప్రీమియం ఫీచర్లతో ఈ ఫోన్లను విడుదల చేసింది. ఇన్​ సీరిస్​లో వచ్చిన ఈ మోడళ్ల ఫీచర్లు, ధర ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • గందరగోళానికి గురి చేసిన గేల్​ ట్వీట్​!
    ఐపీఎల్​లో ప్లేఆఫ్స్​కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది పంజాబ్​ జట్టు. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆటగాడు క్రిస్‌గేల్‌.. ఓ ఆసక్తికర ట్వీట్​ చేశాడు. అది అతడి అభిమానులను అయోమయానికి గురి చేసింది. ఇంతకీ గేల్​ చేసిన ఆ ట్వీట్​ ఏంటంటే? పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి
  • నేచురల్ స్టార్ సినిమాలో రోహిత్ నారా?
    నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో రోహిత్ నారా కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details