టిడ్కో గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ టిడ్కో గృహాల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. పోరాట కమిటీ కార్యదర్శి వి.సాయి బాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి ఏలూరులో 12 వేల మంది దగ్గర నుంచి 50వేల నుంచి లక్ష రూపాయలు చొప్పున మున్సిపల్ కమిషనర్ పేరుతో డిపాజిట్లు చేయించారని అన్నారు. ఇప్పటికీ రెండేళ్లు పూర్తైనా లబ్ధిదారులకు గృహాలు ఇవ్వడం లేదని అని విమర్శించారు.
'టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలి' - westgodavari district latest news
టిడ్కో గృహాల సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు.
cpm dharna
తాము అధికారంలోకి వస్తే ప్రజల దగ్గర వసూలు చేసిన మొత్తం డబ్బులు తిరిగి ఇస్తామని... ఉచితంగానే ఇళ్లు కట్టిస్తామని ఎన్నికల ముందు వైకాపా చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు దానికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా వెంటనే లబ్ధిదారులకు ఇళ్లు అందజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయిస్తామని అన్నారు. ఈ ధర్నాకు సీపీఎం నాయకులు బి.జగన్నాథ రావు, పి.అది శేషులు సంఘీభావం తెలిపారు.