Ministers bus yatra: వైకాపా ఆధ్వర్యంలో శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన 'సామాజిక న్యాయం' బస్సు యాత్ర శనివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు చేరుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు... కైకరం జాతీయ రహదారి పక్కన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కనీసం టెంట్లు కూడా వేయలేదు. సభకు హాజరైన ప్రజలు ఎండలోనే మంత్రుల ప్రసంగం వినాల్సి వచ్చింది. వివిధ గ్రామాల నుంచి ఉపాధి హామీ కూలీలను బస్సులు, ఆటోలలో సభాస్థలికి తరలించారు. మంత్రులు తానేటి వనిత, కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాత్రమే ప్రసంగించారు.
Ministers bus yatra: కనీస ఏర్పాట్లు చేయని వైకాపా... ఎండలోనే జనం - ఏలూరు జిల్లాలో వైకాపా బస్సు యాత్ర
Ministers bus yatra: సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు చేపట్టిన బస్సు యాత్ర సందర్శంగా ఉంగుటూరు ఏర్పాటు చేసిన సభకు ఏర్పాట్లు చేయడంలో నేతలు విఫలమయ్యారు. కనీసం టెంట్లు కూడా వేయకపోవడంతో సభకు వచ్చిన ప్రజలు ఎండలోనే మంత్రుల ప్రసంగం వినాల్సివచ్చింది.
వైకాపా బస్సు యాత్ర
Last Updated : May 28, 2022, 1:40 PM IST