పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పోనంగిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పాల్గొన్నారు. 3,385 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. 128 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్లను పరిశీలించిన ఆయన...పేదలకు పంపిణీ చేసే లేఅవుట్ల వద్ద భూమి పూజ నిర్వహించారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఏలూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి ఆళ్ల నాని - west godavari news
ఏలూరు మండలంలో అర్హులైన లబ్దిదారులకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. 128 ఎకరాల్లో ఏర్పాటు చేసిన లే అవుట్లను మంత్రి పరిశీలించారు.
ఏలూరులో లేఅవుట్ల వద్ద భూమి పూజ చేసిన మంత్రి