''కేంద్రం తీరుకు నిరసనగా.. పుట్టినరోజున పస్తులుంటా''
రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఏలూరు ఎంపీ మాగంటి బాబు దిల్లీలో ఒకరోజు దీక్షకు నిర్ణయించారు.
eluru mp
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఏలూరు ఎంపీ మాగంటి బాబు దీక్ష చేయనున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రేపు తన పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకూ దీక్ష చేస్తానన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఇందులో పాల్గొనున్నారని తెలిపారు.