రాష్ట్రంలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రెవెన్యూశాఖ లోని దేవాదాయ విభాగం నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారి కె.ఎస్ జవహర్ రెడ్డి సేవలను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన్ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ టీటీడీ ఈఓ పూర్తి స్థాయి అదనపు భాద్యతలు కూడా జవహర్ రెడ్డికి ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామల రావును ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర ఈ నెల 30 తేదీన ఉద్యోగ విరమణ అనంతరం పూర్తి బాధ్యతలు చేపట్టాల్సిదిగా ప్రభుత్వం శ్యామల రావును ఆదేశించింది. ఎపి సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండిజీ.సాయిప్రసాద్ ను క్రీడలు,యువజనుల సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇక ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనాను ఆర్ధిక శాఖ లోకి మార్చిన వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు.
ఇటీవల కేంద్ర సర్వీసుల నుంచి తిరిగి వచ్చిన ఏపీ కేడర్ అధికారి ఎస్.సురేష్ కుమార్ ను పాఠశాల విద్యా శాఖ కమిషనర్ గా నియమించారు. వి.చిన వీరభద్రుడు ను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పి.రంజిత్ బాషాను సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా నియమించారు. సి.నాగ రాణి చేనేత జౌళిశాఖ డైరెక్టర్ గా బదిలీ చేశారు. పి.అర్జున్ రావు ను బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు - ap ias transfer news
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన్ను జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో మరికొందరు సీనియర్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇదీ చదవండి: 13654486