ఏలూరులో రోడ్లపై మాస్కులు లేకుండా యథేచ్చగా తిరుగుతున్న వారి పై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వారి వాహనాలను అదుపులోకి తీసుకొని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. కొందరు మాస్కులులేని వారు.. పోలీసులు పట్టుకోవడం చూసి పరుగులు తీశారు. మరికొందరు కాళ్ల వేళ్ల పడి బతిమాలారు. వీరందరికీ డీఎస్పీ దిలీప్ కిరణ్ కౌన్సెలింగ్ చేశారు. మాస్క్ లేకుండా తిరిగితే క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తామని హెచ్చరించారు.
మాస్క్ లేకుండా తిరిగారా? క్వారంటైన్ కేంద్రమే దిక్కు - eluru news
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు.
మాస్క్ లేకుండా తిరిగారు.. క్వారెంటైన్ కేంద్రాలకి వెళ్లారు