ఏలూరులో రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో భార లోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించినట్లు.. మంగళగిరి ఎయిమ్స్ సూపరింటెండెంట్ డా. రాకేష్ కక్కర్ తెలిపారు. సీసం, నికెల్ లోహాల కారణంగానే స్పృహ కోల్పోవడం, మూర్ఛ లక్షణాలు వచ్చాయని వివరించారు. నీటి కాలుష్యమే కారణమై ఉంటుందని భావిస్తున్నామని ఆయన అన్నారు. ఎక్కడినుంచి ఈ భార లోహాలు వచ్చాయో తెలుసుకునేందుకు దిల్లీ ఎయిమ్స్ నుంచి మరో బృందం ఏలూరు వెళ్లిందని తెలిపారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు డా. రాకేష్ కక్కర్ చెప్పారు.
ఏలూరు ఘటన: నమూనాల్లో భార లోహాల అవశేషాలు..! - Rakesh Kakkar Latest News
ఏలూరులో రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో భార లోహాల అవశేషాలను ప్రాథమికంగా గుర్తించినట్లు.. మంగళగిరి ఎయిమ్స్ పర్యవేక్షకులు డా. రాకేష్ కక్కర్ వివరించారు. నీరు, ఆహార నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాకేష్ కక్కర్ చెప్పారు.
డా.రాకేష్ కక్కర్