కరోనాపై అవగాహన కల్పించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. వ్యక్తిగత దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేజీవీ సరిత.. స్వయంగా పాట పాడి ప్రజలను ఆలోచింపజేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసుల కృషిని వివరించారు.
యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత లాక్‌డౌన్ వేళ ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో గడుపుతుంటే.. తాము మాత్రం కంటికి నిద్ర లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నామంటూ వాస్తవ పరిస్థితులను ఇలా పాట రూపంలో వివరించారు.