ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సీఎం జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదు' - జగన్ పై జీవీఎల్ నరసింహరావు విమర్శలు

ముఖ్యమంత్రి జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని.. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా దాడులు జరుగుతున్నాయని భాజాపా నేత జీవీఎల్ నరసింహన్ విమర్శించారు. ఈ ఘటనలపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు
భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు

By

Published : Mar 14, 2020, 5:15 PM IST

భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా జరుగుతున్న దాడులు, బెదిరింపులపై ముఖ్యమంత్రి జగన్ స్పందిచాలని భాజాపా నేత జీవీఎల్ నరసింహరావు డిమాండ్ చేశారు. జగన్​కు ప్రజాస్వామ్యంపై గౌరవం లేకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామపత్రాలు దాఖలు చేయనీయకుండా వైకాపా నాయకులు అడ్డుకోవటం, దాడులు చేయటం హేయమైన చర్య అని విమర్శించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అవినీతికి కొమ్ముకాసిన పలువురు ఐఏఎస్​లు జైలుకు వెళ్లారని, ఆ పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details