కార్మిక సంఘాల నేతలపై ఆర్టీసీ చర్యలు తీసుకుంది. ఏలూరులో ధర్నా చేసిన ఐదుగురు ఎస్డబ్ల్యూఎస్ నేతల జీతంలో ఒకరోజు వేతనాన్ని కోత విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నాకు దిగిన తమపై ఆర్టీసీ చర్యలు తీసుకోవడం చాలా బాధాకరమని కార్మికులు అన్నారు. యాజమాన్యం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ధర్నాకు దిగిన కార్మిక సంఘ నేతలపై ఆర్టీసీ చర్యలు
ఏలూరులో ధర్నా చేసిన ఐదుగురు కార్మిక సంఘం ఎస్డబ్ల్యూఎస్ నేతల జీతంలో ఒకరోజు వేతనాన్ని కోత విధిస్తూ ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
apsrtc