పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా కొవిడ్ రోగులకు చికిత్స చేయడమే కాకుండా... అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఓ ప్రైవేటు ఆస్పత్రిపై అధికారులు చర్యలు చేపట్టారు. నగరంలోని మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని సీజ్ చేశారు.
ఆసుపత్రి మీద వచ్చిన ఆరోపణలపై జిల్లా వైద్య శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్నారని తేలినమేరకు చర్యలకు ఉపక్రమించారు. కొవిడ్ రోగుల నుంచి రోజుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు అధికారులకు కొందరు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలో ఉన్న కొవిడ్ రోగులను ఇతర ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.