తెదేపా ఐటీ గ్రిడ్ సంస్థ దాడులపై మండిపాటు : పయ్యావుల కేంద్రప్రభుత్వం ఆదేశాలతోనే హైదరాబాద్ లోని
ఐటీ గ్రిడ్స్సంస్థపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వఛీప్ విప్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. తమ పార్టీకి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి... వాటితో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన వారిలో కొందరి ఆచూకీ తెలియడం లేదన్నారు. కేంద్రం, తెరాస, వైకాపా కలసి ఇంకా ఏమి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకుడువిజయసాయిరెడ్డి తెలంగాణలో ఫిర్యాదు చేయడం ఏంటనిమండిపడ్డారు.