'చంద్రన్న పథకాలే అధికారం అందిస్తాయి' - tdp wip
శాసనసభ ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధిస్తుందని మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో పయ్యావుల ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమపథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు తక్కువ సమయం ఉండడం వలన రాజకీయ పార్టీల ప్రచారాల జోరు పెంచేశాయి. అనంతరపురం జిల్లా ఉరవకొండలో శాసనమండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ప్రచారం చేశారు. పాతపేట, నెహ్రూ, చాంగల వీధుల్లో ఇంటింటికీ వెళ్లి తెదేపాను గెలిపించాలని కోరారు. సీఎం చంద్రబాబు చేపట్టిన సంక్షేమ పథకాలే తెదేపాకు అధికారం అందిస్తాయని ధీమావ్యక్తం చేశారు. తెదేపాతోనే అన్నీ సామాజికవర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను తీర్చడానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ప్రజలకు హామీ ఇచ్చారు.