ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​ను అభివృద్ధి చేయడమే తప్పా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​పై అనంతపురం తెదేపా ఎన్నికల ప్రచార సభలో సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్​ను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలు తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Chandrababu, Anantapuram tdp meeting

By

Published : Mar 19, 2019, 4:54 PM IST

అనంతపురం సభలో చంద్రబాబు
''హైదరాబాద్​ను అభివృద్ధి చేయడమే మేము చేసిన తప్పా? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మన పోలవరం ప్రాజెక్టుపై కేసులేయించారు. ప్రధాని మోదీతో కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. వైకాపా అధినేత జగన్​ను పావుగా వాడుకుంటున్నారు. అనంతపురం జిల్లా పోరాటాల పురిటిగడ్డ. ఇలాంటి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలి. ఎన్నికల్లో తెదేపా గెలుపు చారిత్రక అవసరం. కుట్రలను తిప్పికొట్టి మళ్లీ తెదేపానే గెలిపించండి. మీ ఓటు సైకిల్ గుర్తుకే'' అని అనంతపురంలో జరిగిన తెదేపా సభలో అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details