ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా ప్రభావం: జూపార్కులు, టైగర్​ రిజర్వులు మూసివేత - telangana varthalu

కరోనా కట్టడిలో భాగంగా హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్​లోని కాకతీయ జూ పార్క్​లను మూసివేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ వెల్లడించారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

zoo closed news
zoo closed news

By

Published : May 1, 2021, 9:49 PM IST

కరోనా రెండో దశ ఉద్ధృతి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్​లోని నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్​లోని కాకతీయ జూ పార్క్​లను మూసివేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్​.శోభ ప్రకటించారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్​లను మూసివేయడంతో పాటు సందర్శకులకు అనుమతి నిలిపివేశామని తెలిపారు.

కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి శోభ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details