స్పందన దరఖాస్తుల్లో 'YSR#' అని ముద్రించడంపై పలు విమర్శలు వినవస్తున్నాయి. స్పందన రసీదులో అర్జీ విభాగం, పేరు, ఫోను, జిల్లా, మండలం తదితర వివరాలన్నీ తెలుగులోనే ఉండగా.. అర్జీ సంఖ్యను మాత్రం 'YSR#' గా (యువర్ స్పందన రిక్వెస్ట్) ఆంగ్లంలో ముద్రించారు.
సమస్యల పరిష్కారంలోనూ ప్రచారమే..
సమస్యల పరిష్కారంలోనూ వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోంది. స్పందన దరఖాస్తుల్లో 'YSR#' అని ముద్రించడంపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
సమస్యల పరిష్కారంలోనూ ప్రచారమే
ఈ అర్జీలోని సమస్య పరిష్కారం, స్థితి కోసం తెలుసుకోవాలంటే 1902కి ఫోను చేసి 'YSR#' అని చెప్పాలంటూ ఓ గమనికను కూడా చేర్చారు. ఇది పరోక్షంగా ప్రచారమేనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:'స్పందనలో అర్జీలు పెట్టుకుంటే.. ఎవరూ స్పందించట్లేదు.. మా సమస్యలు తీరేదెలా?'