ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ys Vijayamma: 'మీకోసం... మీ రాజన్న బిడ్డ వస్తోంది' - Ys vijayamma news

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం (Ys Sharmila Maro Prajaprastanam) యాత్ర ఈనెల 20 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ యాత్రలో వైఎస్ అభిమానులందరూ పాల్గొనాలని వైఎస్ విజయమ్మ (Ys Vijayamma)కోరారు.

Ys Vijayamma
Ys Vijayamma

By

Published : Oct 19, 2021, 11:35 AM IST

ఈనెల 20న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో ప్రజా ప్రస్థానం (Ys Sharmila Maro Praja prastanam) పేరిట చేపట్టబోతున్న పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వైఎస్ విజయమ్మ (Ys Vijayamma) కోరారు. రాజన్న సంక్షేమం, అభివృద్ధి కోసం.. రాజన్న బిడ్డ.. మీ ముందకు వస్తోందని పేర్కొన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి(YSR)ని ప్రేమించే ప్రతి హృదయం.. తన బిడ్డను అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ షర్మిల మొదటి అడుగు వేస్తున్న సమయంలో వైఎస్ అభిమానులు అందరూ వచ్చి ఆశీర్వదించి... అడుగులో అడుగు వేయాలని తెలిపారు.

ప్రజాప్రస్థానం పేరుతో అక్టోబర్ 20 నుంచి తెలంగాణలో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేపట్టనున్నట్లు వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YSRTP President YS Sharmila) ఇదివరకే ప్రకటించారు. నిరుద్యోగ సమస్య (Unemployment problem in telangana) పరిష్కారమయ్యే వరకూ పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏడాదిపాటు 90 నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) సాగుతుందని... జీహెచ్​ఎంసీ మినహా అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర (Praja Prasthanam Padayatra) చేస్తామని స్పష్టం చేశారు. రోజుకు 12-15 కి.మీ మేర పాదయాత్ర (Praja Prasthanam Padayatra) ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని చేవెళ్లలో ప్రారంభించి... చేవెళ్లలోనే ముగిస్తానని షర్మిల తెలిపారు.

ఇదీ చూడండి:కేశినేని నాని పార్టీ మార్పు వార్తలపై క్లారిటీ

ABOUT THE AUTHOR

...view details