ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Sharmila Bonam: తెలంగాణ సంస్కృతికి స్వచ్చమైన రూపమే.. బోనం: షర్మిల - telangana varthalu

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల్లో వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాపెద్ద మంగళవారం గ్రామంలోని త‌న చిన్ననాటి స్నేహితురాలు ర‌జిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో క‌లిసి వై.ఎస్.షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారికి బోనం సమర్పించుకున్నారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

By

Published : Aug 1, 2021, 5:20 PM IST

ఆషాడ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పలు అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు బోనాలను ఎత్తుకుని అమ్మవార్లకు సమర్పించారు. పలు ప్రాంతాల్లోని అమ్మవార్ల అలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పిస్తున్నారు.

మహిళకు బోనం ఎత్తుతున్న షర్మిల..

ఆషాడ మాస బోనాల్లో వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని అమ్మవారికి షర్మిల బోనం సమర్మించారు. త‌న చిన్ననాటి స్నేహితురాలు ర‌జిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో క‌లిసి వై.ఎస్.షర్మిల బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని స్నేహితురాలి కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు.

అచ్చమైన తెలంగాణ సంస్కృతికి స్వచ్చమైన రూపం బోనాల పండుగ అని వైఎస్​ షర్మిల అన్నారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో ఆడపడుచులు ఎత్తే బోనం ప్ర‌జ‌ల‌కు స‌క‌ల శుభాల‌ను తెచ్చిపెట్టాలని ఆమె ఆకాంక్షించారు. ప్ర‌జ‌లంద‌రికీ బోనాల పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details