తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవేళ్ల నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల... ప్రజా ప్రస్థానం ప్రారంభించనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి మళ్లీ అక్కడే ముగిస్తారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం మినహా 16 సెగ్మెంట్లను చుట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందుకు అనుగుణంగా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
తొలిరోజు...
ప్రజాప్రస్థానంలో భాగంగా తొలిరోజు చేవేళ్ల నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచి... మధ్నాహ్నం 12. 30 గంటలకు షాబాద్ క్రాస్ రోడ్డుకు చేరుకుంటారు. అనంతరం కందవాడ గేట్ క్రాస్ వద్ద భోజనం చేసి విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6.5 కిలోమీటర్లు ప్రయాణించి కందవాడ గ్రామానికి చేరుకుంటారు. మొత్తం 10కిలోమీటర్ల వరకు వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది.
వైఎస్సార్ పాలన కోసమే..