ప్రజావ్యతిరేక విధానాలను కచ్చితంగా అడ్డుకుంటామని తెదేపా నేత యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపితే వాటిని అడ్డుకున్నారని..అలాంటి పద్ధతి మంచిది కాదని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఆషామాషీగా వ్యవహరించడం సరికాదన్నారు. మండలి వ్యతిరేకించిన 2 బిల్లులను గవర్నర్ ప్రసంగం ద్వారా తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు.
'ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెడితే.. అదే పరిస్థితి' - ఏపీలో మూడు రాజధానుల వార్తలు
సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై మండలి ఛైర్మన్‌కు పూర్తి అధికారాలు ఉంటాయని మండలిలో ప్రతిపక్ష నేత యనమల స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై అభ్యంతరం చెప్పారు.
రాష్ట్రాభివృద్ధిని సీఎం జగన్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం అన్ని విధాలా నష్టపోతున్నా తనకేమీ పట్టనట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించడం లేదన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని యనమల ఆరోపించారు. తెలంగాణతో విభజన సమస్యలను పరిష్కరించుకోలేకపోయిందని పేర్కొన్నారు. వీటన్నింటికి సీఎం జగన్ వైఖరే కారణమన్నారు.
ఇదీ చదవండి : ఆ చెట్టు వేర్లను చూస్తే ఔరా అనాల్సిందే..!