ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

పోలవరం ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ నిర్ణయం.. కేంద్రానికి చెప్పాకే అమలు చేశామని.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అవినీతి నిర్మూలన దిశగా.. తమకు మోదీ, అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయని చెప్పారు.

By

Published : Aug 21, 2019, 4:05 PM IST

Updated : Aug 21, 2019, 4:23 PM IST

vijayasai reddy

కేంద్రానికి చెప్పాకే.. పోలవరం రివర్స్ టెండరింగ్: విజయసాయి

పోలవరం జలాశయ నిర్మాణ టెండర్లు రద్దు, పీపీఏల రద్దుపై.. వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇన్నాళ్లూ.. తెదేపా నేతలు ఈ విషయంపై ఆగ్రహం, అభ్యతరం వ్యక్తం చేస్తున్నా పెద్దగా స్పందించని వైకాపా నేతలు.. ఇప్పుడు మాత్రం అంతా కేంద్రానికి చెప్పే చేస్తున్నాం.. అని తేల్చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో దిల్లీలో వైకాపా ఎంపీల సమావేశం అనంతరం.. విజయసాయిరెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. ప్రధాని మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సంప్రదించాకే ముఖ్యమంత్రి జగన్.. ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలవరం రివర్స్ టెండరింగ్, పీపీఏల విషయంలోనూ మోదీతో మాట్లాడాకే నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని..రాష్ట్ర ఖజానాను దోచుకుందని ఆయన ఆరోపించారు. వారందరినీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పంగా విజయసాయి చెప్పుకొచ్చారు. కొండవీటి వాగు కారణంగా అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

Last Updated : Aug 21, 2019, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details