ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ ప్రభుత్వ చర్యలపై కోర్టులకెళ్లండి : ఎంపీ రఘురామ

ఎంపీ రఘురామకృష్ణరాజు ...రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఒక మతాన్ని పోత్సహించేందుకు జీవో తెచ్చారని, వారికి ఆర్థిక సాయం చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ చర్యలపై హిందూ సంస్థలు కోర్టులకు వెళ్లాలని కోరారు. ఏపీలో జరుగుతున్న అంశాలపై ప్రధాని మోదీకి లేఖ రాశానని ఎంపీ తెలిపారు.

By

Published : Oct 21, 2020, 4:54 PM IST

Ycp mp raghuramkrishna raju
Ycp mp raghuramkrishna raju

వైఎస్​ఆర్​ బీమా పథకంపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు చేశారు. గతంలో ఉన్న పథకానికే పేరు మార్చారని ఆరోపించారు. సంక్షేమ పథకాల్లో కేంద్ర వాటా ఉన్నా ఏ ఒక్క పథకంలో ప్రధాని పేరు రాయడం లేదన్నారు.

ప్రజాధనం దుర్వినియోగం

పాస్టర్లకు నెలకు రూ.5 వేల జీవో.. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం ఓ మతవ్యాప్తికి కృషి చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తోందన్నారు. ఏపీలో 1.8 శాతం క్రిస్టియన్లు ఉంటే 30 వేల మంది పాస్టర్లు ఉన్నారన్నారు.

క్రైస్తవ మతవ్యాప్తిని అడ్డుకోకుంటే హిందూధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని రఘురామ అన్నారు. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను హిందువులు అడ్డుకోవాలని రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రభుత్వ చర్యలపై హిందూ సంస్థలు కోర్టులకు వెళ్లాలన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లో తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికా ఇచ్చిన ప్రాధాన్యం చూసి తెలుగు అభిమానులు గర్వపడాలి. ఆంగ్లమాధ్యమంలో బోధన జీవోను రాష్ట్రం వెనక్కి తీసుకోలేదు. ఓ మత వ్యాప్తి కోసమే ఆంగ్లమాధ్యమం పెట్టారనే అనుమానం వస్తోంది. --రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ

ప్రధానికి లేఖ

బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి వారి మధ్య చిచ్చు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని రఘురామ ఆరోపించారు. మరచిపోయిన కులాల ప్రస్తావన తెచ్చి మళ్లీ చిచ్చు పెట్టకూడదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రధానికి లేఖ రాశానని ఆయన అన్నారు. 1.8 శాతం ఉన్నవారికి ఇచ్చే ప్రాధాన్యతపై విచారణ జరపాలని కోరారన్నారు.

ఇదీ చదవండి:

ప్రమాదం పొంచి ఉందని తెలిసినా నిర్లక్ష్యం వీడరా..?

ABOUT THE AUTHOR

...view details