ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అంతం కాదిది ఆరంభం: రఘురామకృష్ణరాజు - హైకోర్టులో ఏపీ రాజధానిపై విచారణ

అమరావతికి సంబంధించి ఈనెల 27 వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 'ఇది అంతం కాదు.. ఆరంభం' అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. 3 రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా అంటూ ప్రశ్నించారు.

ycp mp raghuramakrishna raju about three capitals issue
రఘురామకృష్ణరాజు, ఎంపీ

By

Published : Aug 14, 2020, 2:08 PM IST

Updated : Aug 14, 2020, 3:23 PM IST

'ఒక రాజధానికే డబ్బుల్లేవు, 3 రాజధానులు కావాలా?' అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ సందర్భంగా పై విధంగా స్పందించారు. ఈనెల 27 వరకు స్టేటస్ కో ఉత్తర్వులు అమల్లో ఉంటాయంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో 'ఇది అంతం కాదు.. ఆరంభం' అని అన్నారు. 3 రాజధానుల అభివృద్ధికి ప్రభుత్వం వద్ద నిధులున్నాయా? అంటూ ప్రశ్నించారు.

రాష్ట్రానికి ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని రఘురామ ప్రశ్నించారు. బాటా పాదరక్షల రేటులా కేంద్రాన్ని రూ. 9.9 లక్షల కోట్లు అడుగుతున్నారని విమర్శించారు. నిర్మాణ సంస్థలకు రూ. వేల కోట్ల బిల్లులు ఇవ్వాలని.. కేంద్రం ఇచ్చిన డబ్బు చెల్లించకపోతే రేపో మాపో వారంతా దిల్లీలో ధర్నా చేస్తారన్నారు.

  • జగన్ బొమ్మతో గెలవలేదు.. రాజీనామా చేయను

ఒక సామాజికవర్గం నాయకులు తనపై మాటల దాడి చేస్తున్నారని.. తనను ఫోన్​లో బెదిరించేది ఆ వర్గం వారే అని ఎంపీ ఆరోపించారు. బెదిరింపు కాల్స్‌పై న్యాయం జరుగుతుందని నమ్మకం లేదన్నారు. జగన్‌ బొమ్మతో తాను గెలవలేదు కనుక రాజీనామా చేయనని స్పష్టంచేశారు.

ఇవీ చదవండి..

మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

Last Updated : Aug 14, 2020, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details