పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం నిలబెట్టుకోవాలని వైకాపా ఎంపీ సుభాష్‌చంద్రబోస్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించిన బోస్....ప్రత్యేకహోదా కోసం ఏపీ ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారన్నారు. ప్రధానమంత్రే స్వయంగా ఇచ్చిన హామీని తర్వాత వచ్చిన ప్రధాని అమలు చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
'హోదాపై నాడు ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి' - ప్రత్యేక హోదాపై పిల్లి సుభాష్ చంద్రబోస్ కామెంట్స్
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల చిరకాల కోరిక అని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. నాడు పార్లమెంటు సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్