రాష్ట్రంలో మరో ప్రజాప్రతినిధి కరోనా వైరస్ బారిన పడ్డారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైఎస్ వర్థంతి సందర్భంగా సెప్టెంబరు 1, 2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి వైరస్ సోకినట్లు బయటపడింది. కొవిడ్ నిర్ధారణ కావటంతో ఎంపీ వెంటనే హోం ఐసోలేషన్లోకి వెళ్లిపోయారు. అయితే కొద్ది రోజులుగా ఆయనతో కలిసి తిరుగుతున్న వారిలో ఆందోళన నెలకొంది.
వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ - కరోనా పాజిటివ్
వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి రెడ్డికి కరోనా సోకింది. కొవిడ్ నిర్ధారణ కావడంతో ఎంపీ...హోం ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే కొద్దిరోజులుగా ఆయనతో కలిసి తిరుగుతున్న వారిలో ఆందోళన నెలకొంది.
ycp mp avinash reddy