అవినీతి అక్రమాల కేసుల్లో మాజీమంత్రి దేవినేని ఉమా జైలుకు వెళ్లడం ఖాయమని... వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. పట్టిసీమ సహా... పలు సాగునీటి ప్రాజెక్టుల్లో గుత్తేదారుల నుంచి రూ.కోట్లలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. మైలవరం నియోజకవర్గంలోని బాధితులంతా త్వరలోనే బయటకువస్తారని అన్నారు.
'ప్రాజెక్టుల్లో అవినీతిని త్వరలోనే బయటపెడతాం'
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారని... త్వరలోనే ఆధారాలు బయటపెడతామని పేర్కొన్నారు.
ycp-mla-vasantha-kumar-fire-on-devineni-uma
ప్రభుత్వం చేస్తోన్న విచారణలో... అవినీతి అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయమన్నారు. దేవినేని ఉమా వ్యవహారశైలి నచ్చక... గత ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని... ప్రస్తుతం చంద్రబాబు కూడా పక్కన పెట్టారని ఆరోపించారు. వైకాపాలోకి రావాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని... సీఎం జగన్ పెట్టిన నిబంధన వల్లే తెదేపా మిగిలిందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : 'అలా జరగకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతా'