ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మూడు రాజధానుల నిర్ణయం సరైనదే'

అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా... 3 రాజధానుల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని అధికారపక్షం పునరుద్ఘాటించింది. పాలన వికేంద్రీకరణతో వెనుకబడిన ప్రాంతాలకు మేలు జరుగుతుందని నేతలు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంటున్నారు.

YCP leaders on capital cities
'మూడు రాజధానుల నిర్ణయం సరైనదే'

By

Published : Dec 22, 2019, 5:57 AM IST

'మూడు రాజధానుల నిర్ణయం సరైనదే'

విశాఖను పాలనా రాజధానిగా చేయడం ఫలితంగా... భీమిలి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వివరించారు. మధురవాడలో సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి ఎంపీ పాల్గొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి మూడు రాజధానుల నిర్ణయం మేలు చేస్తుందని ఉద్ఘాటించారు.

రాష్ర్టానికి 3 రాజధానులు ప్రకటించి... సీఎం జగన్‌ మంచిపని చేశారని వైకాపా నేతలు కొనియాడారు. ప్రాంతీయ భేదాలు, వెనుకబాటుతనం వల్లే రాష్ర్ట విభజన జరిగిందన్న సాంఘిక సంక్షేమ మంత్రి పినిపె విశ్వరూప్‌... భవిష్యత్తులో అలాంటి అసమానతలు తలెత్తకుండా ఉండేందుకే... 3 రాజధానుల ప్రకటన చేశారన్నారు. అభివృద్ధిని వికేంద్రీకరించేందుకే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాయలసీమ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసే నిర్ణయం చాలా గొప్పదని... మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అభిప్రయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని వివరించారు. విశాఖలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలన్న జీఎన్‌రావు కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి తెలిపారు. సాగరనగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్​గా నిర్ణయించడం వల్ల ఖర్చు తగ్గుతుందన్నారు. రహదారి, రైలు, విమాన, జల సౌకర్యాలు ఉన్నాయన్నారు. పరిపాలనా పరంగా విశాఖను కేంద్రంగా చేయడం వల్ల... ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందాలన్న స్థానికుల కోరిక నెరవేరుతుందని చెప్పారు.

ఇదీ చదవండీ...

'చంద్రబాబుపై కసితోనే అమరావతికి మంగళం'

ABOUT THE AUTHOR

...view details