ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అరెస్టులతో ఉలిక్కిపడతారే... అవినీతికి సంకెళ్లు తప్పవు' - atchemnaidu arrest news

తెదేపా నేతల అరెస్ట్​లపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై అధికార పార్టీ నేతలు స్పందించారు. పూర్తి ఆధారాలతోనే అరెస్ట్ చేస్తుంటే...అక్రమ కేసులు పెడుతున్నారంటూ విమర్శలు చేయటం తగదన్నారు. తమకు ఎవరిపైన కక్ష లేదని... ఇన్నాళ్లు అవినీతి ఉంటే బయటపెట్టాలని సవాల్‌ చేసిన తెదేపా నాయకులు ఇప్పుడెందుకు ఉలిక్కి పడుతున్నారని వైకాపా నేతలు ప్రశ్నించారు.

ycp-leaders-counter-in-tdp
వైకాపా నేతలు

By

Published : Jun 13, 2020, 10:39 PM IST

తెదేపానేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టులు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అరెస్టులపై తెదేపా మండిపడుతోంది. అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తుంది. విపక్షాల ఆరోపణలపై వైకాపా నేతలు బదులిచ్చారు. తాము పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశామని..కక్ష పూరితంగా వ్యవహరించలేదన్నారు. తప్పు చేసిన వారెవరైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అవినీతి రూపుమాపడమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

చర్చకు సిద్ధమా..!

అక్రమ కేసులు పెడుతున్నారంటూ తెదేపా నేతలు ఆరోపిస్తున్నారని మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. జేసీ ట్రావెల్స్ పై అక్రమాల విషయంలోనే..ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశామన్నారు. వాటికి సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని.. మీడియా సమక్షంలో చంద్రబాబు చర్చకు రావాలని సవాలు విసిరారు.

అనవసర రాద్ధాంతం చేస్తున్నారు...

అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటుంటే....అనవసర రాద్ధాంతం చేయడం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అవినీతిని రూపమాపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని...అందులో భాగంగానే తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న చంద్రబాబు....అవినీతిపరులపై చర్యలు తీసుకోవద్దని చెప్పదలచుకున్నారా అంటూ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

తప్పు ఎవరు చేశారో చెప్పాలి...

తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు.. అన్ని ఆధారాలతో చట్ట ప్రకారమే జరిగిందని శాసన సభాపతి‌ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేస్తామని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు తప్పు చేయకపోతే ఎవరు చేశారో వారే చెప్పాలన్నారు. ఈ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడే విధానం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి:'ఎర్రన్నాయుడిపై కోపాన్ని అచ్చెన్నాయుడిపై తీర్చుకుంటున్నారు'

ABOUT THE AUTHOR

...view details