పవన్ కల్యాణ్.. స్పష్టమైన విధానాలతో ప్రజాసమస్యలపై పోరాడాలన్నారు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala satires on pawan kalyan news). పబ్లిసిటీ, సినిమా షూటింగ్ కార్యక్రమాలతో ఎలాంటి లాభం ఉండదంటూ సెటైర్లు విసిరారు. సాధారణ విధుల్లో భాగంగానే కాటన్ బ్యారేజ్‌పై గుంతలు పూడ్చారని వెల్లడించారు. ఎవరో వస్తున్నారని ఉలిక్కిపడాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.
Sajjala on Pawan: పబ్లిసిటీ, సినిమా షూటింగ్ కార్యక్రమాలతో లాభం ఉండదు: సజ్జల - ఏపీ తాజా వార్తలు
sajjala satires on pawan kalyan
16:34 October 01
sajjala satires on pawan kalyan
వర్షాలు, వరదల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని సజ్జల అన్నారు. రోడ్ల నిర్మాణానికి రూ.2 వేల కోట్లకుపైగా నిధులతో టెండర్లు పిలిచామని చెప్పారు. వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతు పనులు చేపడతామన్నారు. బద్వేల్ ఉప ఎన్నిక(badvel by election 2021 news)పై స్పందించిన ఆయన.. గతంకంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి
PAWAN KALYAN: రాజమహేంద్రవరంలో పవన్‌కల్యాణ్ శ్రమదానం వేదిక మార్పు
Last Updated : Oct 1, 2021, 5:12 PM IST