ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్త వేరియంట్​పై విపక్షానిది విషప్రచారం: సజ్జల - sajjala fiers on chandrababu

కరోనా వైరస్ విషయంలో తెదేపా నేతల తీరుపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విపక్షం విషప్రచారం చేస్తోందని.. అందువల్లే ఒడిశా, దిల్లీ ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపై ఆంక్షలు విధించాయని అన్నారు. టీకాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు.

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

By

Published : May 7, 2021, 3:41 PM IST

Updated : May 7, 2021, 7:50 PM IST

ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తిలో ఉందని విపక్షం విష ప్రచారం చేస్తోందని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం ప్రచారం వల్లే ఒడిశా, దిల్లీ ప్రభుత్వాలు ఏపీ ప్రజల రాకపై ఆంక్షలు విధించాయన్నారు. ఎన్ 440కే వైరస్ కేరళలో చాలాకాలం నుంచి ఉందని పరిశోధకులు తేల్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్440 కే వైరస్ లేదని సీసీఎంబీ చెప్పిందని సజ్జల స్పష్టం చేశారు.

ఎన్440కే వైరస్ అంత ప్రమాదకరమైంది కాదని పరిశోధనల్లో తేలిందని చెప్పారు. టీకా తయారీతో పాటు.. పంపిణీ వ్యవహారాలు కేంద్రం పరిధిలో ఉన్నాయన్నారు. 25 లక్షల డోసులు కోరితే 6.4 లక్షలు డోసులే పంపారన్న సజ్జల.. 4.04 లక్షల డోసులు కొంటామని సీరం సంస్థకు సీఎస్‌ లేఖ రాశారని చెప్పారు. 3 లక్షల డోసులు ఇవ్వాలని భారత్ బయోటెక్‌ను ప్రభుత్వం అడిగిందని పేర్కొన్నారు. కేంద్ర కేటాయింపుల ప్రకారమే ఇస్తామని రెండు సంస్థలు చెప్పాయని.. టీకాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని జనం తెలుసుకోవాలని కోరారు.

Last Updated : May 7, 2021, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details