వైకాపా ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని నిర్వీర్యం చేసిందని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. నిధులను దారి మళ్లించి కార్పొరేషన్లకు తూట్లు పొడిచిందని మండిపడ్డారు. కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని ఆరోపించారు. మేడే సందర్భంగా తెదేపా నేతలు, ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఆన్లైన్లో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం స్పష్టించిన ఇసుక కొరత వల్ల 40లక్షల భవన కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. 60 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు. అన్నా క్యాంటీన్లు, అసంఘటిత కార్మికులకు బీమా పథకాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
పసుపు జెండాలో కార్మిక చక్రం స్ఫూర్తిగా పనిచేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నిర్దేశించారు. కార్మికుల హక్కుల సాధనకు తెదేపా పునరంకితం కావాలని అన్నారు. కార్మికుల కష్టాల ఫలితాలనే సమాజంలో ప్రజలంతా అనుభవిస్తోందన్న చంద్రబాబు... టీఎన్‌టీయూసీని బలోపేతం చేసి నాయకత్వాన్ని పటిష్టం చేద్దామని పిలుపునిచ్చారు.