ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఐడీ నుంచి సీబీఐకి యరపతినేని కేసు

రాజకీయ ఆరోపణలు, కోట్ల రూపాయల మేర అక్రమంగా గనులు తవ్వారని మాజీ ఎమ్మెల్యే యరపతినేనిపై ఆరోపణలు రావడంతో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది.

సీఐడీ నుంచి సీబీఐకి యరపతినేని కేసు

By

Published : Sep 5, 2019, 8:27 AM IST

లైమ్‌స్టోన్‌ గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌ పై ఆరోపణలు రావడంతో ప్రస్తుతం ఆ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది. తాజాగా అక్రమ గనుల తవ్వకాలను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ... ఈ నిర్ణయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌కు తెలిపారు.
ఇటీవల మాజీ ఎమ్మెల్సీ టీవీజీ కృష్ణారెడ్డి ఈ కేసును సీఐడీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీఐడి దర్యాప్తు ఈ కేసులో పురోగతి సాధించలేకపోతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్‌పై ఇటీవల వాదనలు జరిగిన అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కేసును సీఐడీ నుంచి సీబీఐకి అప్పగించాలా అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గంలో గనుల తవ్వకాల అంశంపై చర్చ జరిగింది. ఈ కేసులో రాజకీయ ఆరోపణలు రావడం, కోట్ల రూపాయల మేర అక్రమంగా గనులు తవ్వారని యరపతినేనిపై ఆరోపణలు రావడంతో కేసును సీబీఐకి బదిలీ చేయాలని కేబినేట్‌ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి అడ్వకేట్‌ జనరల్‌ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details