'మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన పనేంటి'
మండలిలో వైకాపా తీరుపై తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఎప్పడూ రాని మంత్రులందరూ బుధవారం మండలి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
'మండలికి 22 మంది మంత్రులు రావాల్సిన పనేంటి'
శాసనమండలి సమావేశానికి ఒకేసారి 22 మంది మంత్రులు రావాల్సిన అవసరమేముందని... మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. రూల్ 90 కింద మండలి ఛైర్మన్‌కు తాను నోటీసు ఇచ్చానని చెప్పారు. దీనికి అనుగుణంగా బిల్లుకు సంబంధించిన మంత్రులు మాత్రం ఉండాలన్నారు. గతంలో జరిగిన సమావేశాలకు కనీసం ఇద్దరు మంత్రులు కూడా హాజరుకాలేదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు ఇంతమంది వచ్చారని ప్రశ్నించారు. అమరావతి అంటే వైకాపా నేతలకు ఎందుకింత కక్ష అని నిలదీశారు.
Last Updated : Jan 23, 2020, 8:29 PM IST