ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 26, 2021, 10:43 PM IST

ETV Bharat / city

ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడుల పేరిట మోసం.. రూ.2.10లక్షలు కాజేసిన వైనం

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకుల నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడుల ప్రకటనను నమ్మి హైదరాబాద్​కు చెందిన ఓ మహిళ రూ.2.10లక్షలను పోగొట్టుకున్నారు.

cyber crime
cyber crime

సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ఫేస్​బుక్​లో ప్రకటనలు పెట్టి అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ హైదరాబాద్​లోని బాలానగర్​కు చెందిన మహిళ నుంచి రూ.2.10 లక్షలు కాజేశారు.

ఆన్​లైన్ షాపింగ్ పెట్టుబడి అంటూ ఫేస్​బుక్​లో ప్రకటనను చూసి డబ్బులను పోగొట్టుకున్న ఆదర్శ్ నగర్​కు చెందిన ఆర్తి ప్రియ పోలీసులను ఆశ్రయించారు. తాము పంపే లింక్ ద్వారా రిజిస్టర్ అయ్యి అందులో పెట్టుబడి పెట్టాలంటూ సైబర్ కేటుగాళ్లు వాట్సాప్​లో మెసేజ్ చేశారని తెలిపారు. అది నమ్మి పలు దఫాలుగా రూ.2.10లక్షలను చెల్లించినట్లు వెల్లడించారు.

ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయని బాధితురాలు అడగగా... మరికొంత నగదు చెల్లిస్తేనే వస్తాయని అన్నారని పేర్కొన్నారు. లేదంటే డబ్బులు రావని బుకాయించారని వాపోయారు. చివరకు మోసపోయానని గ్రహించిన బాధితురాలు బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:Suicide: సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని పదేళ్ల బాలుడి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details