సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళా రైతులు - సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళా రైతులు
రాజధానిలో పెయిడ్ ఆర్టిస్టులే ఆందోళన చేస్తున్నారన్న సినీ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మందడంలో రోడ్డుపై బైఠాయించి నల్లజెండాతో నిరసన తెలిపిన మహిళలు...ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అన్నదాతలను కించపరిచేలా వ్యవహరించిన పృథ్వీరాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడితే ...తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
women-farmers-angry-on-prudwiraj-in-amaravathi
.