ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో 'శీతాకాల సంబరాలు' - రామోజీ ఫిల్మ్‌సిటీ

మైమరపించే ప్రదర్శనలు... జిగేల్‌మనిపించే వెలుగులు.. భూతల స్వర్గంగా పేరొందిన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో కొత్త సంవత్సర వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సరికొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ.. చల్లటి వాతావరణంలో వెచ్చని ఆనందాలను పంచుతోంది. క్రిస్మస్‌, న్యూ ఇయర్​ సందర్భంగా 'శీతాకాల సంబరాలు' తొలిరోజు అంబరాన్నంటాయి.

winter-celebration-at-ramoji-film-city
హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో 'శీతాకాల సంబరాలు'

By

Published : Dec 14, 2019, 8:17 AM IST

అబ్బురపరిచే కట్టడాల నిలయం
పర్యటక స్వర్గధామం రామోజీఫిల్మ్‌సిటీలో 'వింటర్‌ ఫెస్ట్' అట్టహాసంగా ప్రారంభమైంది. కళాఖండాలు, అబ్బురపరిచే కట్టడాలకు నిలయమైన ఫిలింసిటీలో సాయంత్రం వేళ ఆకట్టుకొనే అందాల మధ్య కొనసాగే కార్నివాల్‌ సందర్శకులకు కనులవిందు చేస్తోంది.

మధురానుభూతి పంచే కార్యక్రమాలు
నృత్య బృందాలు, స్టిల్ట్‌ వాకర్స్‌, జుగ్లర్స్‌ పంచే వినోదంతో పర్యటకులు కేరింతలు కొడుతున్నారు. ఆనందాలను పంచేలా సాగే కార్నివాల్‌ పరేడ్‌, విద్యుద్దీపాలంకరణలోని గార్డెన్ల అందాలు వీక్షిస్తూ ఆనందలోకాల్లో విహరిస్తున్నారు.

స్టంట్‌షో - అద్భుతాలు
ఫిల్మ్‌సిటీ అందాలను, కార్నివల్ పరేడ్‌ను, కళాకారుల ప్రదర్శనతో పాటు.... పక్షులు, సీతాకోక చిలుకల ఉద్యావనం, స్పేస్‌షిప్‌ అనుభూతిని పొందుతున్నారు. మినీ వరల్డ్‌ టూర్‌, ఫిల్మీదునియా, సినిమా చిత్రీకరణలోని మ్యాజిక్‌ను చూసే యాక్షన్‌ థియేటర్‌, పలు రైడ్స్‌, స్టంట్‌షోలను ఆస్వాదిస్తున్నారు.

జనవరి 26వరకు- 45 రోజుల హంగామా
బాహుబలి సెట్ల సందర్శన, ప్రత్యక్ష వినోదం, సాయంత్రం వినోదాల్లో మునిగితేలుతున్నారు. వీనుల విందైన సంగీతాల నడుమ నిన్న ప్రారంభమైన వింటర్‌ ఫెస్ట్... జనవరి 26వరకు 45 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలతో కొనసాగనుంది.

ఇవీ చూడండి: తెలంగాణ ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ

ABOUT THE AUTHOR

...view details